దేవుడి వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు..?సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరి కాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక. 
ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే.
 కొబ్బరికాయ అంటే మనవ శరీరం, బొండం పైనున్న చర్మం, మన చర్మం...పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం...కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

Comments

Popular posts from this blog

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.

నితిన్ కు కలసి రాదేమో