Posts

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?

Image
ప్రదక్షిణం లో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనము...ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉన్నది.  పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశారుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్ధం.

దేవుడి వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు..?

Image
సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ, యజ్ఞ, హోమాదుల్లోనూ, కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పని సరి. కొబ్బరి కాయపై ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక.  ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కోడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని, లోపల ఉన్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరినీరులా తమ జీవితాలని ఉంచమని అర్ధం. సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే.  కొబ్బరికాయ అంటే మనవ శరీరం, బొండం పైనున్న చర్మం, మన చర్మం...పీచు మనలోని మాంసము, పెంకే ఎముక, కొబ్బరే ధాతువు, అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం...కాయ పైనున్న మూడు కళ్ళు ఇడ, పింగళి, సుషుమ్న అనే నాడులు.

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.

Image
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను నమ్మించి గొంతు కోశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.ఆమె శనివారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ....ముఖ్యమంత్రి తక్షణమే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. హామీల అమలుపై  వైఎస్ జగన్ మాట్లాడుతున్నారే కానీ, ఆయన వ్యక్తిగత సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. చంద్రబాబు ఇలాగే ప్రవర్తిస్తే ప్రతిపక్ష నేతగా ఆయన ఇంకా గట్టిగా మాట్లాడతారని వాసిరెడ్డి పద్మ అన్నారు.టీడీపీ నేతలు సభ్య సమాజం తలదించుకునేలా వైఎస్ జగన్ ను దూషిస్తున్నారన్నారు. వైఎస్ జగన్ సహనంతో ఉన్నారని అడ్డగోలుగా మాట్లాడటం సరికాదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రజల కష్టంపై మాట్లాడితే హీనాతిహీనంగా విమర్శిస్తారా అని ఆమె ప్రశ్నించారు. సభ్యత, సంస్కారం ఉన్నవారెవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నలు సంధించారు.చంద్రబాబును  ఒక్క మాట అన్నందుకే ఇంత కోపం వస్తే జగన్ అన్ని మాటలు అంటుంటే మాకెంత కోపం రావాలని ప్రశ్నించారు.

నితిన్ కు కలసి రాదేమో

Image
తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ సినిమా అంటే హీరో చుట్టూ తిరుగుతుంటుంది. అందులో హీరోయిన్ ని డామినేషన్ ఏమాత్రం ఉన్న మార్కులన్నీ హీరోయిన్ కే పోతుంది. అ..ఆ సినిమాకు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న సినిమా అనే టాక్ వినిపించింది. విడుదలైన తర్వాత అది నిజమే అని అనిపించింది. సినిమాలో సమంత డామినేషన్ ముందు నితిన్ బొమ్మలా నిలబడిపోయాడు. క్లైమైక్స్ కి ముందు అత్తకు క్లాస్ తీసుకునే సీన్ లో నితిన్ కాకుండా...సామంత చేసుంటే.... ఈ సినిమాలో నితిన్ పాత్ర మరింత తేలిపోయేది. అయితే ఈ సినిమాలో నితిన్ చాలా సేతిల్డ్ గా పెర్ఫోర్మ్ చేసినట్లు అనిపించింది. కొత్తగా కనిపించడానికి శతవిధాల ప్రయత్నించాడు. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ బాగా పండించాడు. అయితే సినిమాపై త్రివిక్రమ్, సమంతల ముద్ర ఆల్రెడీ ఉండడంతో సినిమా క్రెడిట్ ఆ ఇద్దరి లిస్టులో పడిపోయింది. నితిన్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా చెప్పుకోవడానికే తప్ప నితిన్ కు మిగిలింది ఏమి లేదని అంటున్నారు. దాంతో నితిన్ కెరీర్ కు పెద్దగా కలసి రాదనే చెప్పాలి.