గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ?

ప్రదక్షిణం లో ప్ర అనే అక్షరం పాపాలకి నాశనము...ద అనగా కోరికలు తీర్చమని, క్షి అన్న అక్షరము మరజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ణ అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్ధం ఉన్నది.
 పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి, పరమేశారుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నాను అని అర్ధం.

Comments

Popular posts from this blog

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి.

నితిన్ కు కలసి రాదేమో